PAWAN KALYAN: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్.. గూస్‌బంప్స్ పక్కా!

by Anjali |
PAWAN KALYAN: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్.. గూస్‌బంప్స్ పక్కా!
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. దీంతో ఏకంగా మూడు సినిమాలు(ఉస్తాద్ భగత్ సింగ్,ఓజీ, హరహర వీరమల్లు) పెండింగ్‌లో పడిపోయాయి. దీంతో దర్శక, నిర్మాతలు నెత్తి పట్టుకునే పరిస్థితి వచ్చింది. నూతన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అటు పాలనపై ఫోకస్ పెట్టడంతో సినిమాల వైపు రావట్లేదు. ఇటీవలే నిర్మాత రత్నం పవన్ ను కనీసం 10 రోజుల సమయం కావాలని అడిగిన విషయం తెలిసిందే. ఎందుకంటే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న పవర్ స్టార్ ‘హరహర వీరమల్లు’ చిత్రం మిగతా షూటింగ్ పూర్తి చేద్దామనే ఆలోచనలో ఉన్నారట.

ఇదిలా ఉండగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్ మరోటి నెట్టింట దుమారం రేపుతోంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఓజీ’ సినిమాకు డిప్యూటీ సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. సాధ్యైనంత తొందరగ చిత్ర షూటింగ్ కంప్లీట్ చేస్తామని మేకర్స్ ప్రామిస్ కూడా చేశారంటూ సమాచారం. ఈ వార్త విన్న పవర్ స్టార్ అభిమానుల సంతోషం అంబరాన్నంటుతోంది. ఓజీ ఒక్కో సీన్ గూస్ బంప్స్ రావాల్సిందే అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. శ్రేయరెడ్డి, శ్యామ్, అర్జున్ దాస్ తదితరులు మఖ్యపాత్రల్లో మెరవనున్నారు. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని సమకూర్చనున్నారు.

Advertisement

Next Story