పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. ‘OG’ షూటింగ్ స్టార్ట్ (వీడియో)

by GSrikanth |   ( Updated:2023-12-16 14:52:30.0  )
పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. ‘OG’ షూటింగ్ స్టార్ట్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా.. యంగ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ఓజీ(OG). ప్రభాస్‌తో సాహో లాంటి సినిమా తీసిన సుజిత్‌పై పవర్ స్టార్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఈ చిత్రం నుంచి తాజాగా.. మేకర్లు ఓ అప్‌డేట్‌ను వదిలారు. ముంబయి వేదికగా నేటి నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ మొదలైంది. వచ్చే వారం నుంచి పవన్‌కల్యాణ్‌ ఈ షూట్‌లో భాగం కానున్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఓ ప్రత్యేక వీడియోను షేర్‌ చేసింది. దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఓజీ ఫొటోలు, పోస్టులతో రచ్చ చేస్తున్నారు.

Advertisement

Next Story