నాగార్జున ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘మన్మధుడు’ సినిమా రీరిలీజ్‌కు డేట్ ఫిక్స్

by Hamsa |   ( Updated:2023-08-17 06:00:51.0  )
నాగార్జున ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘మన్మధుడు’ సినిమా రీరిలీజ్‌కు డేట్ ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. నిత్యం స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతూ థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నాయి. హిట్, ఫ్లాప్ అని తేడా లేకుండా ఫ్యాన్స్ కోసం మేకర్స్ అన్ని చిత్రాలను రీరిలీజ్ చేస్తున్నారు. తాజాగా, నాగార్జున బ్లాక్ బస్టర్ మూవీ ‘మన్మథుడు’ సినిమా విడుదల కాబోతుంది. ఆగస్ట్ 29న ‘మన్మథుడు’ చిత్రాన్ని రీ రిలీజ్‌ చేస్తున్నట్టు అన్నపూర్ణ స్టూడియో ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ చిత్రం నాగార్జున కెరీర్‌లో ఒక బిగ్గెస్ట్ హిట్‌ చిత్రాల్లో ఒకటి. అంతేకాదు రొమాంటిక్‌ లవ్‌ స్టోరీలోనూ ఓ సరికొత్త ట్రెండ్ క్రియేట్‌ చేసింది. ఈ మూవీతోనే నాగ్‌కి ‘మన్మథుడు’ అనే ట్యాగ్‌ని కూడా వేశారు ఆడియెన్స్. కె విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో అన్షు, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించారు. 2002 డిసెంబర్‌ 20న ఈ చిత్రం విడుదలై పెద్ద హిట్‌ అయ్యింది. దాదాపు 21 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని నాగార్జున బర్త్ డే కానుకగా రాబోతుండటంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.

Advertisement

Next Story