మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘Bhola Shankar’ ప్రీరిలీజ్‌కు తేదీ ఖరారు

by Hamsa |   ( Updated:2023-08-04 04:01:21.0  )
మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘Bhola Shankar’ ప్రీరిలీజ్‌కు తేదీ ఖరారు
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి, తమన్నా కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ‘భోళా శంకర్’. ఇందులో కీర్తి సురేష్ చిరుకి చెల్లిగా నటిస్తుండగా.. ఆమెకు జంటగా సుశాంత్ నటిస్తున్నాడు. మెహర్ రమేష్ చాలా గ్యాప్ తర్వాత దర్శకత్వం వస్తున్న మాస్ ఎంటర్టైనర్ సినిమా ఇది. ఈ మూవీ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈసినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది.

కాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్ డేట్ తాజాగా వైరల్ అవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను కూడా ఖరారు చేశారు. హైదరాబాద్‌లోని ‘శిల్పకళావేదిక’ లో ఈ నెల 6వ తేదీన రాత్రి 7 గంటల నుంచి ఈ వేడుకను ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. తమిళంలో కొంతకాలం క్రితం వచ్చిన ‘వేదాళం’ సినిమాకి ఇది రీమేక్ అనే విషయం అందరికీ తెలిసిందే.

Also Read: Samanthaను రవితేజ సినిమాలో విలన్‌తో పోల్చిన నెటిజన్!

Advertisement

Next Story