ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. నాగచైతన్య శోభిత పెళ్లి డేట్ ఫిక్స్.. వీరి మ్యారేజ్‌కు వెళ్లనున్న సమంత..

by Kavitha |   ( Updated:2024-08-09 04:06:39.0  )
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. నాగచైతన్య శోభిత పెళ్లి డేట్ ఫిక్స్.. వీరి మ్యారేజ్‌కు వెళ్లనున్న సమంత..
X

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా నాగచైతన్య, శోభిత ధూళిపాళ రిలేషన్‌లో ఉన్నట్లు వచ్చిన వార్తలను నిజం చేస్తూ నిన్న(గురువారం) ఉదయం 9:42 AM కు ఈ ఇద్దరు ఎంగేజ్మెంట్ చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చారు. దీనిపై అఫిషీయల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ.. అక్కినేని నాగార్జున తన X ఖాతా ద్వారా వీరిద్దరి నిశ్చితార్థం ఫొటోలు షేర్ చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టారు. దీంతో ఈ వార్త వైరల్‌గా మారింది.

ఇదిలా ఉంటే.. ఎంగేజ్‌మెంట్ అయిపోయిన సందర్భంగా తాజాగా వీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందులో భాగంగా ఈ ఏడాదే చైతన్య- శోభితల పెళ్లి వేడుక జరగనుందని.. అది కూడా పరిమిత సంఖ్యలో బంధుమిత్రుల మధ్య జరిగే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం నాగ చైతన్య వయస్సు 37 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. ఇక చైతన్య శోభిత మధ్య ఏజ్ గ్యాప్ ఐదేళ్లు అని తెలుస్తోంది. అయినా వీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లి దిశగా అడుగులు వేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఈ పెళ్లికి బాగా కావాల్సిన వ్యక్తులను మాత్రమే ఇన్వైట్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే సమంతను కూడా పెళ్లికి పిలువబోతున్నట్లు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఎందుకంటే.. నాగచైతన్య సమంత విడిపోయినప్పటికీ మాజీ కోడలితో నాగార్జున అలాగే అక్కినేని అఖిల్‌లకు మంచి సంబంధాలే ఉన్నాయి. దానికి ఎక్జామ్‌పుల్‌గా విడాకుల తర్వాత సామ్ మయోసైటీస్ వ్యాధి బారిన పడి హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫొటోలు షేర్ చేసినప్పుడు తనకు సపోర్ట్‌గా కామెంట్ చేశాడు. అలాగే అతని బర్త్‌డే రోజున సామ్ అఖిల్‌కు విష్ చేయడం ఇవన్నీ చూస్తుంటే నాగచైతన్యతో సామ్ విడిపోయినప్పటికీ వారి ఫ్యామిలీతో మంచి రిలేషన్ కంటిన్యూ చేస్తుందనే తెలుస్తుంది. దీంతో ఈ పెళ్లికి సామ్‌ను కూడా ఇన్వైట్ చేస్తారని తెలుస్తోంది. మరి ఈ మ్యారేజ్‌కు సమంత వెళుతుందా లేదా అనేది తెలియాలంటే అప్పటి వరకు వేచి ఉండాల్సిందే.

Advertisement

Next Story