Salaar : డార్లింగ్‌ ఫ్యాన్స్‌కు శుభవార్త.. వచ్చేస్తున్న ‘Salaar’ ఫస్ట్‌ సింగిల్‌..?

by sudharani |   ( Updated:2023-08-01 05:51:13.0  )
Salaar : డార్లింగ్‌ ఫ్యాన్స్‌కు శుభవార్త.. వచ్చేస్తున్న ‘Salaar’ ఫస్ట్‌ సింగిల్‌..?
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా సినిమా ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఎప్పుడెప్పుడు తెరపైకి వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌ విశేషంగా ఆకట్టుకుంది. మొదట మిశ్రమ స్పందన లభించినప్పటికీ ఆ తర్వాత నెట్టింట దుమ్మురేపింది. ఇదిలా ఉంటే.. ఆగస్టులో క్రేజీ అప్ డేట్స్ ఉంటాయని ఇప్పటికే చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మూవీ నుంచి మరో అప్ డేట్ ఇచ్చారు.

తాజాగా అందుతున్న సమాచారం మేరకు.. ఆగస్టు రెండో వారంలో మొదటి సింగిల్ రిలీజ్ చేయనున్నారట. ఇందులో ప్రభాస్‌ పాత్రని ఎలివేట్‌ చేసేలా, హీరోయిజాన్ని ఆవిష్కరించేలా ఈ పాట సాగుతుందని తెలుస్తోంది. అంతే కాకుండా.. ఆగస్ట్ మూడు, నాలుగో వారాల్లో ‘సలార్‌’ ట్రైలర్‌ని విడుదల చేసే అవకాశం ఉందని నెట్టింట టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ.. ఇదే కనుక నిజం అయితే డార్లింగ్ అభిమానులకు ఇది కిక్ ఇచ్చే న్యూస్ అవుతోంది అనడంలో అతిశయోక్తి కాదు.

Advertisement

Next Story