ఫస్ట్ ఆడిషన్‌లోనే పక్కలోకి రమ్మన్నాడు.. లైంగిక వేధింపులపై నటి ఓపెన్

by Hamsa |   ( Updated:2023-09-14 07:20:15.0  )
ఫస్ట్ ఆడిషన్‌లోనే పక్కలోకి రమ్మన్నాడు.. లైంగిక వేధింపులపై నటి ఓపెన్
X

దిశ, సినిమా: కార్తీక్ రత్నం, సతీశ్‌వర్మ కాంబోలో వస్తున్న నయా మూవీ ‘ఛాంగురే బంగారురాజా’. ఈ మూవీతో హీరోయిన్‌గా పరిచయం కాబోతున్న యంగ్ బ్యూటీ గోల్డీ నిసీ ప్రచారంలో భాగంగా మూవీ విశేషాలతోపాటు కాస్టింగ్ కౌచ్ అనుభవాలను షేర్ చేసుకుంది. ‘హీరోయిన్‌గా ఇదే నా ఫస్ట్ మూవీ. కరప్టడ్‌ కానిస్టేబుల్‌గా నటించాను. నా క్యారెక్టర్‌లో హ్యూమర్‌తో పాటు లవ్‌, ఎమోషన్స్‌ అన్నీ ఉంటాయి. మెకానిక్‌గా కార్తీక్, కానిస్టేబుల్‌గా నేను. మా ఇద్దరి సన్నివేశాల్ని ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తారు’ అని చెప్పింది. అలాగే లైంగిక వేధింపులపై మాట్లాడుతూ.. ‘కాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాలు నాకేం ఎదురుకాలేదు. కానీ ఓ ఆడిషన్ వెళ్లినప్పుడు ‘బాగా చేశావ్‌. మరి ఏమ్ లేదా?’ అంటూ ఒకాయన ఏదేదో అడిగాడు. అప్పుడు నాకు అర్థం కాలేదు. అంతకుమించి పెద్దగా ఇబ్బందిపడలేదు’ అని తెలిపింది. ఇక హీరో రవితేజ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 15న రిలీజ్ కానుంది.

Advertisement

Next Story