వైరల్ అవుతున్న సౌందర్య చివరి మాటలు

by Dishaweb |
వైరల్ అవుతున్న సౌందర్య చివరి మాటలు
X

దిశ, సినిమా: మహానటి సావిత్రి తర్వాత తెలుగులో అంతటి పేరు, గుర్తింపు సొంతం చేసుకున్న నటి సౌందర్య. గ్లామర్ షో చేయకుండా చీరకట్టులోనే కనిపించి అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది. అలా విజయవంతంగా సాగుతున్నా తన జీవితం ఓ ప్రమాదంతో అర్ధంతరంగా ఆగిపోయింది. 2004 ఏప్రిల్ 17న ఆమె తుదిశ్వాస విడిచారు. ఇక తాజాగా సౌందర్య గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయట పెట్టింది తన మేనకోడలు. ‘ఎన్నికల ప్రచారం కోసం నా వద్ద కాటన్ చీరలు లేవు. కాటన్ చీరలు.. కుంకుమ కావాలి తీసుకురావాలి’ అని చెప్పి ఎన్నికల ప్రచారం కోసం విమానంలో బయలుదేరింది’ అని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది సౌందర్య కోడలు.

Advertisement

Next Story

Most Viewed