- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా మనోభావాలను గాయపరిచిన అడ్వకేట్లందరిపై కేసు పెట్టబోతున్న: ఆర్‌జీవి
దిశ, వెబ్‌డెస్క్: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ వాస్తవ సంఘటనలపై తన దైన శైలిలో స్పందిస్తుంటారు. ఇదిలా ఉంటే.. రామ్ గోపాల్ వర్మ తాజాగా తనను కించపరుస్తూ తన మనోభావాలను గాయపరచిన వారిపై కేసు పెడతానని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అసలు విషయం ఏంటంటే..
ఇటీవలె వర్మ గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శటీలో జరిగిన అకడమిక్ ఎగ్జిబిషన్‌లో ముఖ్య అతిథిగా పాల్గొ్న్నారు. ఈ కార్యక్రమంలో ఆయన గెస్ట్ లెక్షర్ ఇస్తూ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ క్రమంలో ఆయన దైన శైలిలో మాట్లడేశారు. అయితే ఆ వ్యాఖ్యలు వైరల్ కావడమే కాకుండా వివాదస్పదంగా మారాయి. దీంతో వర్మను ఈ కార్యక్రమానికి గెస్ట్‌గా పిలిచినందుకు టీడీపీ మహిళా వర్గం ఇప్పటికే వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్‌పై దుమ్మెత్తిపోసింది. ఈ కార్యక్రమంలో వర్మ మహిళలను కించపరిచేలా మాట్లాడారు అని మండిపడ్డారు. ఈ మేరకు అతనిపై పెదకాకాని సీఐకి ఫిర్యాదు చేశామని చెప్పారు. దీనిపై కేసు పెట్టి ఆర్జీవీపై తగిన చర్యలు తీసుకునేంత వరకు తమ పోరాటం ఆగదని తెలిపారు.
అయితే.. మహిళా న్యాయవాదుల డిమాండ్‌పై తాజాగా వర్మ సోషల్ మీడియా వేదికగా స్పందిచారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో తాను మాట్లాడిన స్పీచ్‌కు సంబంధించిన మొత్తం కాపీని గూగుల్ డాక్యుమెంట్‌లో సేవ్ చేసి ‘‘నన్ను కించపరుస్తూ నా మనోభావాలను గాయపరిచిన ఈ అడ్వకేట్లందరి మీద కేసు పెట్టబోతున్న’’ అంటూ ఓ బాంబు పేల్చారు వర్మ. మరి ఈ గొడవ ఇంకెంత దూరం వెళుతుందో వేచి చూడాల్సి ఉంది.
నన్ను కించపరుస్తూ నా మనోభావాలను గాయపరిచిన ఈ అడ్వకేట్లందరి మీద కేసు పెట్టబోతున్నాను https://t.co/8GL5aaApqj https://t.co/d7YrbGNcJ8https://t.co/aboaGYV3qI
— Ram Gopal Varma (@RGVzoomin) March 23, 2023
Also Read...
‘నాటు నాటు’ పాటకు తోలు బొమ్మ స్టెప్పులు.. చూస్తే వావ్ అనాల్సిందే: ఆనంద్ మహీంద్రా ట్వీట్