'గాడ్‌ఫాదర్‌' ట్రైలర్‌ టైమ్‌ ఫిక్స్..

by Seetharam |   ( Updated:2022-09-28 08:59:38.0  )
గాడ్‌ఫాదర్‌ ట్రైలర్‌ టైమ్‌ ఫిక్స్..
X

దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ 'గాడ్ ఫాదర్'. తమిళ దర్శకుడు మొహన్‌రాజా తెరకెక్కించిన ఈ సినిమా అక్టోబ‌ర్ 5న విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో స‌ల్మాన్‌ఖాన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లో న‌టిస్తుండగా.. సత్యదేవ్, న‌య‌న‌తార కీల‌క‌ పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాదు తమన్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సైతం ఓ చిన్న పాత్రలో కనిపించనున్నాడు. ఇక మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ రోజు(బుధవారం) అనంతపూర్‌‌లో గ్రాండ్‌గా జరగనున్న ప్రీరిలీజ్‌ ఈవెంట్‌‌లో మూవీ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Also Read: భర్త కోసం నయనతార చెత్త నిర్ణయం.. మరో సావిత్రి కానుందా?

Advertisement

Next Story