ఓటీటీలోకి 'గాడ్ ఫాదర్'.. డిజిట‌ల్ రైట్స్‌ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్?

by Hajipasha |   ( Updated:2022-09-19 04:40:23.0  )
ఓటీటీలోకి గాడ్ ఫాదర్.. డిజిట‌ల్ రైట్స్‌ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్?
X

దిశ,సినిమా: మెగాస్టార్ చిరు నటిస్తున్న తాజా చిత్రం 'గాడ్ ఫాదర్'. మోహ‌న్‌రాజా ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోగా ముఖ్యమంత్రి కుటుంబాన్ని కాపాడే గ్యాంగ్‌స్టర్‌గా చిరు కనిపించనున్నాడు. ఇదిలావుంటే.. సల్మాన్‌ఖాన్ ఎంట్రీతో ఈ చిత్రంపై ఎక్స్‌పెక్టేషన్స్ మరో రేంజ్‌కు వెళ్లిపోగా డిజిట‌ల్ రైట్స్ కోసం ఓటీటీ సంస్థల మధ్య గ‌ట్టి పోటీ నడుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం 'గాఢ్ ఫాదర్' డిజిట‌ల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెటిఫ్లిక్స్ భారీ ధ‌ర‌కు ద‌క్కించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు థియేట‌ర్లలో విడుద‌లైన ఆరు వారాల త‌ర్వాత ఓటీటీలో సినిమాను రిలీజ్ చేసేలా నిర్మాత‌ల‌కు, సదరు ఓటీటీ సంస్థకు మ‌ధ్య ఒప్పందం కుదిరినట్లు సిని వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాగా దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Also Read : మెగాస్టార్‌కు భారీ షాక్.. ఇంట్రస్ట్ చూపని డిస్ట్రిబ్యూటర్స్..

Also Read: 'శాకుంతలం'నుంచి దేవ్ మోహన్ ఫస్ట్‌లుక్.. ఫ్యాన్స్ ఫిదా

Advertisement

Next Story