జపాన్‌లో చరణ్ ‘రంగస్థలం’ స్పెషల్ షో

by Prasanna |   ( Updated:2023-04-05 08:19:33.0  )
జపాన్‌లో చరణ్ ‘రంగస్థలం’ స్పెషల్ షో
X

దిశ, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన కెరీర్‌లో అందుకున్న బ్లాక్ బస్టర్ విజయాల్లో ”రంగస్థలం” ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2018, మార్చి 30న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ఆ సినిమాను జపాన్‌లో విడుదల చేస్తున్నారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో చొగో సిటీ‌లో షోస్ వేస్తున్నారు. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ను జపాన్‌‌లో రిలీజ్ చేయగా రూ.100కోట్లు రాబట్టింది. దీంతో అక్కడ చరణ్ క్రేజ్‌ను గుర్తించిన అక్కడి ఫేమస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ స్పేస్ బాక్స్ ‘రంగస్థలం’ స్పెషల్ షోస్ వేయడానికి సిద్ధమైంది. మొత్తానికి చిట్టిబాబు జపాన్‌లో కూడా సందడి చేయడానికి సిద్ధం అవుతున్నాడు.

War 2: ‘వార్ 2’ లో హృతిక్‌తో పోటీకి దిగుతున్న ఎన్టీఆర్

Advertisement

Next Story