Game Changer: అక్టోబర్ నుంచి గేమ్ ఛేంజర్ వరుస అప్డేట్స్.. టీజర్ ఎప్పుడంటే?

by Prasanna |   ( Updated:2024-09-30 03:36:18.0  )
Game Changer: అక్టోబర్ నుంచి గేమ్ ఛేంజర్ వరుస అప్డేట్స్.. టీజర్ ఎప్పుడంటే?
X

దిశ , వెబ్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం, శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ మూవీలో హీరో నటిస్తున్నాడు. ఈ సినిమా అప్డేట్స్ కోసంమెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో గత నాలుగు రోజులు నుంచి గేమ్ ఛేంజర్ అప్డేట్స్ తో మోత మోగిపోతుంది.

సెకండ్ సాంగ్ ఈ రోజు రిలీజ్ చేయనున్నారు. ఇక, ఈ సాంగ్ ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు, అనంత్ శ్రీరామ్ ఓ ఇంటర్వ్యూ చేసారు.

దీనిలో దిల్ రాజు గేమ్ ఛేంజర్ అప్డేట్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసాడు. "ఇప్పుడు రెండో పాట రాబోతుంది. అక్టోబర్ మంత్ స్టార్టింగ్ లో టీజర్ విడుదల చేస్తున్నాం. అలాగే, అక్టోబర్ చివర్లో మూడో పాట కూడా రిలీజ్ చేయబోతున్నాము. అక్టోబర్ నుంచి ఇలా వరుస అప్డేట్స్, ఈవెంట్స్ తో మూవీ టీం ఫుల్ బిజీ కానున్నారు. సినిమాని క్రిస్మస్ కి రిలీజ్ చేయడానికి చూస్తున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫాస్ట్ గా కాదు సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నాయని " తెలిపారు. గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఇలా ఎవరు ఊహించని విధంగా స్టార్ట్ చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story