ఎంత కష్టమైనా భరిస్తా.. ఫ్రాన్స్‌లో లొకేషన్స్ వీడియో తీస్తూ అభిమానులతో ముచ్చటించిన Chiranjeevi

by Hamsa |   ( Updated:2023-03-24 17:48:37.0  )
ఎంత కష్టమైనా భరిస్తా.. ఫ్రాన్స్‌లో లొకేషన్స్ వీడియో తీస్తూ అభిమానులతో ముచ్చటించిన Chiranjeevi
X

దిశ, సినిమా: బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ 'వాల్తేరు వీరయ్య' సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 13న రిలీజ్ కానుంది. ఇందులో ముఖ్యమైన పాత్రలో ర‌వితేజ కూడా న‌టిస్తున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ స్థాయిలో నిర్వహించ‌బోతున్నట్లు తెలిసింది.. మేకర్స్ ఇంతకుముందు మొదటిపాట బాస్ పార్టీ అంటూ విడుదల చేశారు. ఇక వారు ప్రస్తుతం ఫ్రాన్స్‌లో చిరంజీవి, శృతి హాసన్‌తో మరో సాంగ్ చిత్రీకరణ కూడా పూర్తి చేశారు. దీంతో చిరంజీవి ఫ్రాన్స్‌లోని లోకేషన్స్‌ను వీడియో తీస్తూ.. అభిమానులతో తన అభిప్రాయాలు పంచుకుంటూ.. ముచ్చటించారు. '' నేను ఫ్రాన్స్ నుంచి మాట్లాడుతున్నా.. నాకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది ఎందుకంటే.. ఇక్కడ నేను చూసిన ప్రతీ లోకెషన్ అద్భుతంగా ఉంది. ఇది మీతో కూడా షేర్ చేసుకోవాలనుకున్నాను. మొత్తం 8 డిగ్రీస్ మంచులో ఈ సాంగ్‌ను తీశారు. అసలు స్టెప్ కూడా చేయలేక పోయాం.. చలి అంత ఘోరంగా ఉంది మరి. కానీ నా అభిమానుల కోసం నేను ఎంత కష్టమైనా భరిస్తా. ఇక ఈ లిరికల్ సాంగ్ త్వరలోనే రిలీజ్ కానుంది. అంతవరకు... '' అంటూ సాంగ్‌లోని చిన్న బిట్‌ను లీక్ చేశారు చిరంజీవి.

ఎరుపెక్కిన నిక్కీ తంబోలి అందాలు.. ఫిదా అవుతున్న కుర్రాళ్లు..

Advertisement

Next Story