Mr. Bachchan: వారంలోనే నాలుగు సూపర్‌హిట్‌ సాంగ్స్.. మిస్టర్ బచ్చన్‌పై అంచనాలు పెంచేస్తున్న హరీష్‌ శంకర్‌ కామెంట్స్

by Hamsa |   ( Updated:2024-08-13 12:46:20.0  )
Mr. Bachchan: వారంలోనే నాలుగు సూపర్‌హిట్‌ సాంగ్స్.. మిస్టర్ బచ్చన్‌పై అంచనాలు పెంచేస్తున్న హరీష్‌ శంకర్‌ కామెంట్స్
X

దిశ, సినిమా: మాస్‌ చిత్రాల కథానాయకుడు రవితేజ, దర్శకుడు హరీష్‌ శంకర్‌ ద్వయం కలిస్తే ఇక డబుల్‌ మాస్‌..ఈ పర్‌ఫెక్ట్‌ మాస్‌ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం 'మిస్టర్‌ బచ్చన్‌'. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. ఆగస్టు15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు హరీష్‌ శంకర్‌తో జరిపిన ఇంటర్వ్యూ ఇది

'మిస్టర్ బచ్చన్' కి ది ఓన్లీ హోప్ అనే ఉపశీర్షిక పెట్టారు ఎందుకని?

-ఇందులో హోప్ హీరో క్యారెక్టరైజేషన్. ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణమే హీరో క్యారెక్టర్‌లో ఉన్న నిజాయితీ హీరోయిజం. ఓ వాస్తవ ఘటనను ప్రేరణగా తీసుకున్న కథ ఇది. 1980లో ఈ సంఘటన నార్త్ ఇండియాలో జరిగింది. సినిమాటిక్ లిబర్టీ తీసుకొని చేసిన కథ. ఆ రోజుల్లోనే లక్షల రూపాయల లంచం ఇస్తామని ఆఫర్ చేసినా సరే ఓ ఆఫీసర్ ఎక్కడా లొంగకుండా నిజాయితీగా ఉంటాడు. నాకు ఆ పాయింట్ చాలా నచ్చింది.. రవితేజ సినిమా అంటే మాస్ పాటు ఫ్యామిలీస్‌తో కూడా చూస్తారు. ఈ మూవీ కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌ విత్‌ ఆల్‌ ఎమోషన్స్‌

ఇందులో ఎంటర్‌టైన్మెంట్‌ని ఎలా బిల్డ్ చేశారు ?

ఇది పేరు రీమేక్‌ కానీ ఈ సినిమా కథలో చాలా మార్పులు చేశాడు. ఈ సినిమా విడుదల తరువాత ఈ మాట మీరే అంటారు. ఈ సినిమా మాతృకలో నటించిన అజయ్‌దేవగన్‌ పాత్రకు ఈ సినిమాలో రవితేజ క్యారక్టరైజేషన్‌కు చాలా తేడా ఉంది. రవితేజ ఇమేజ్‌, ఆయన క్రేజ్‌కు తగ్గట్టు సినిమా ఉంటుంది. నీతి, నిజాయితి ఉన్న వ్యక్తుల జీవితంలో కూడా ఫన్ రొమాన్స్ లవ్ అన్నీ ఉంటాయి. ఇందులో తన ప్రేమలో నిజాయితీ ఉంటుంది. తను చేసిన ఫైట్ లో నిజాయితీ ఉంటుంది. నిజాయితీ అనే పాయింట్ నుంచే అన్నీ వచ్చాయి. ఇక ఈ సినిమా వర్జినల్‌ రైడ్ కాస్త సీరియస్‌గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఒకటే బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. అలా చూసినప్పుడు ఆడియన్స్‌ అందరూ సీరియస్‌ మూడ్‌లో ఉంటారు.అందుకే ఈ సినిమాలో అది ఎవైడ్ చేశాం. ఫస్ట్ హాఫ్‌లో ఎంటర్ టైన్మెంట్ ఎలా వచ్చిందో మీరు చూసినప్పుడు అర్ధమైపోతుంది.

కమర్షియల్ సినిమా అంటే ఇలాగే ఉండాలని మీరు ఎవరి నుంచి నేర్చుకున్నారు?

-మా నాన్న నుంచే. ఆయన అమితాబ్ బచ్చన్ ఫ్యాన్. నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడే నాకు సినిమా ఇష్టమని ఆయనకు అర్ధమైపోయింది. చిన్నప్పటి నుంచే తెలుగు, హిందీ లిటరేచర్, సినిమాలు అంటే ఇష్టం. జంధ్యాల గారు, బాపు రమణ గారు సినిమాల్లో మాటలు విపరీతంగా వినేవాడిని. అలాగే ఈవీవీ గారి సినిమాలకి కూడా ఎట్రాక్ట్ అయ్యాను. సో. ఆ వాతావరణంలో పెరిగిన నాకు సినిమాతో పాటు సినిమాలో వుండాల్సిన మీటర్లు అన్ని తెలిసిపోయాయి.

మొదటిసారి మిక్కి.జే.మేయర్‌ను కలిసి పనిచేశారు? పాటలు కూడా అందరిని అలరిస్తున్నాయి? ఆయనతో వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌?

మిస్టర్‌ బచ్చన్‌ పాటలన్నీ ఒక వారంలోనే పూర్తి చేశాం. ఒక వారంలోనే నాలుగు సూపర్‌హిట్‌ సాంగ్స్‌ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. నా ప్రతి సినిమాలో మ్యూజిక్‌ బాగుంటుందనే ఫీలింగ్‌ ఆడియన్స్‌లో కూడా ఉంది. నేను డైరెక్టర్‌గా కొన్ని సార్లు ఫెయిల్ అయినా నా పాటలు ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. ఆదిత్య మ్యూజిక్ వారు హరీష్ శంకర్ హిట్స్ అని క్యాసెట్ రిలీజ్ చేశారు. నాకు మొదటి నుంచి పాటలు చాలా ఇష్టం. గద్దలకొండ గణేష్ లో అన్ని పాటలు హిట్టు. మిక్కీ మోస్ట్ అండర్ రేటెడ్ కంపోజర్ అని నా ఫీలింగ్. మిక్కీ చాలా మితభాషి. మా ఇద్దరి కాంబినేషన్ బాగా మ్యాచ్ అయ్యింది.

సినిమా సాహిత్యం విషయంలో కూడా మీరు కేర్‌గా ఉంటారని మీ పాటల లిరిక్స్‌ చూస్తే అర్థమవుతుంది?

నేను పెరిగిన వాతావరణం వల్ల కాబోలు నాకు చిన్నప్పటి నుంచి సాహిత్యం చాలా ఇష్టం. సినిమా చూడని రోజు ఉంటుందేమో కానీ పాట వినని రోజు ఉండదు. ఒక మంచి వాక్యం ఇచ్చిన స్ఫూర్తి మరేది ఇవ్వలేదు. నాకు మ్యూజిక్ ఒక థెరపీ. ముఖ్యంగా లిరిక్స్ ని చాలా శ్రద్ధగా వినడం, స్ఫూర్తి పొందడం అలవాటు. 'మా ఊపిరి నిప్పుల ఉప్పెన.. మా ఊహల కత్తుల వంతెన'(వేటూరి) ఇలాంటి వాఖ్యలు విన్నప్పుడు గొప్ప ఎనర్జీ వస్తుంటుంది. నా పాటలు కూడా ఇలా లిరిక్స్ తో గుర్తు చేసుకోవాలనేది తాపత్రయం. ఇందులో కాసర్ల శ్యామ్, వనమాలి, భాస్కర భట్ల, సాహితీ చాలా చక్కని సాహిత్యం రాశారు.

అమితాబ్‌, చిరంజీవి పోస్టర్స్‌ని పాటల్లో చూపించారెందుకని?

క్యాసెట్ రికార్డింగ్ సెంటర్స్ ఉన్న రోజులో జరిగే కథ ఇది. అప్పట్లో బహిరంగంగానే పోస్టర్లు పెట్టి క్యాసెట్ రికార్డ్స్ చేసేవారు. ఆ టైం ని గుర్తు చేద్దామని లిరికల్ వీడియోలో అమితాబ్ గారు, చిరంజీవి గారి పోస్టర్స్ చూపించడం జరిగింది.

మీ ప్రతి సినిమాలో ప్రేమకథ కూడా ఉంటుంది? ఈ సినిమాలో లవ్‌స్టోరీ ఎలా ఉంటుంది?

నేను బీహెచ్ఈఎల్ లో పెరిగాను. అక్కడ ఓ మంచి లవ్ స్టొరీ తీయాలని ఎప్పటినుంచో కోరిక. అయితే నాకున్న మాస్ ఇమేజ్ కి తీయడం కుదరలేదు. ఈ సినిమాలో ఆ ప్రేమ కథ కోరిక ఎంతోకొంత తీరింది. ఇందులో లవ్ స్టొరీ బ్యూటిఫుల్‌గా ఉంటుంది.

రవితేజ పాత్రలో ఉండే కొత్తదనం ఏమిటి?

- ఎవరూ చూడని నేపథ్యంలో మనం మర్చిపోయిన జ్ఞాపకాలని గుర్తు చేస్తూ, మనకి గుర్తున్న జ్ఞాపకాలు చూపిస్తూ, రవితేజ గారి నుంచి ఏం ఆశిస్తారో అలాంటి ఎలిమెంట్స్ తో సినిమాని తీర్చిదిద్దాం. ముఖ్యంగా సెకాండాఫ్‌లో రవితేజ గారి పెర్ఫార్మెన్స్ చూసి ఆడియన్స్ చాలా కొత్తగా ఫీలౌతారు. నటుడిగా ఆయనలో ఒక కంప్లీట్ నెస్ కనిపించింది. ఐటీ ఆఫీసర్ కి సూట్ అయ్యేలా రవితేజ గారు తనని మలచుకున్నారు, రవితేజ గారికి సూట్ అయ్యేలా కథని మలుచుకున్నాం. రెండు బ్యాలెన్స్ చేశాం.

హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గురించి ?

1990 బ్యాక్‌డ్రాప్‌లో ఒక వీధిలో జిక్కీ అనే అమ్మాయి వుండాలి అన్నప్పుడు.. అ అమ్మాయికి గత సినిమాల ఇమేజ్ ఉండకూడదని కొత్త అమ్మాయిని తీసుకున్నాం. ఈ సినిమాతో భాగ్యశ్రీ బిజీ హీరోయిన్‌ అయిపోతుంది. మంచి నటిగా పేరు తెచ్చుకుంటుంది. ఈ సినిమా విషయంలో బడ్జెట్‌ కూడా పెరిగిందని అంటున్నారు?

కథకు ఎంత ఖర్చు పెట్టాలో అంత పెట్టారు. ఇక విశ్వ ప్రసాద్ గారు లేకపోతే ఈ సినిమా ఇంత గ్రాండ్ గా వచ్చేది కాదు, 15న రిలీజ్ చేసేవాళ్ళం కాదు. మార్కెట్, ఫైనాన్సియల్ ఈక్వేషన్స్ తో సంబంధం లేకుండా మేము అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తునప్పుడు కళ్యాణ్ గారు ఎలక్షన్స్‌లో బిజీ అయ్యారు. కాంపెయిన్ నుంచి రిజల్ట్ వచ్చేవరకూ ఈ సినిమా ఫినిష్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నాం. రవితేజ గారు లాంటి హీరో, విశ్వ ప్రసాద్ గారు లాంటి ప్రొడ్యూసర్ దొరకడంతో అనుకున్న సమయానికి కంప్లీట్ అయ్యింది.

ఫైనల్‌గా మిస్టర్ బచ్చన్ గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారు ?

మిస్టర్ బచ్చన్ మళ్ళీ మళ్ళీ చూసేలా ఉంటుంది. ఖచ్చితంగా సినిమా రిపీట్ ఆడియన్స్ వచ్చేలా ఉంటుంది.

Advertisement

Next Story