Jr.NTR: ఆస్కార్‌ కోసం అమెరికా బయలు దేరిన యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్

by Prasanna |   ( Updated:2023-03-08 10:29:10.0  )
Jr.NTR: ఆస్కార్‌ కోసం అమెరికా బయలు దేరిన యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్
X

దిశ, సినిమా: ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో, రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా నటించిన ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ మూవీ ఆస్కార్‌ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. కాగా ఈ నెల12న అవార్డుల ప్రదానం జరగనుంది. ఇప్పటికే రామ్‌చరణ్‌, రాజమౌళి, కీరవాణి, మూవీ ప్రమోషన్‌లో భాగంగా అమెరికాలో బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆడియన్స్‌తో ముచ్చటిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో ఎన్టీఆర్‌ కూడా భాగం కావాల్సి ఉన్నప్పటికీ ‘తారకరత్న’ మరణంతో ఆగిపోవాల్సి వచ్చింది. ఇక్కడి కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి కాబట్టి ఈ రోజు ఉదయం అమెరికా భయలుదేరాడు యంగ్‌ టైగర్‌. తాజాగా అతను ఎయిర్ పోర్టుకు చేరుకున్న పిక్స్ వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

Next Story