వాళ్ల ఆనందంకోసం ఎంత రిస్క్ అయినా చేస్తా: Tiger Shroff

by Hamsa |   ( Updated:2023-10-19 09:16:22.0  )
వాళ్ల ఆనందంకోసం ఎంత రిస్క్ అయినా చేస్తా: Tiger Shroff
X

దిశ, సినిమా : ప్రతి సినిమాలో తనను తాను నిరూపించుకోవడానికి చాలా కష్టపడతానంటున్నాడు టైగర్ ష్రాఫ్. రీసెంట్‌గా ఆయన నటించిన ‘గణపథ్’ అక్టోబరు 20న విడుదల కానుండగా జోరుగా ప్రచారం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘యాక్షన్ జానర్‌లో నటించే ప్రతి సినిమాకు నన్ను నేను కొత్తగా సిద్ధం చేసుకోవడం సవాలుతో కూడిన పని. ఇప్పటికీ చాలా యాక్షన్ సినిమాలు చేశాను.

అయినా కొత్తగానే అనిపిస్తుంది. ప్రతి ప్రాజెక్ట్‌కు నన్ను నేను తీర్చిదిద్దుకుంటాను. అయినా నేను ఇంకా చాలా చేయాల్సివుందని అనుకుంటున్నా. ప్రేక్షకులను ఇంకా ఎంటర్‌టైన్ చేయాలి. అందుకోసం ఎంత రిస్క్ చేయడానికైనా నేను రెడీగా ఉంటాను’ అన్నాడు. అలాగే ‘గణపథ్’ కేవలం యాక్షన్ మూవీ మాత్రమే కాదని, ఇందులో లవ్ స్టోరీ కూడా ఉందన్న టైగర్.. చాలా గ్యాప్ తర్వాత కృతిసనన్‌తో పనిచేయడం ఆనందంగా ఉందని చెప్పాడు.

Advertisement

Next Story