'మళ్లీ మళ్లీ' అదరగొడుతున్న 'ఏజెంట్' ఫస్ట్ సింగిల్!

by Vinod kumar |
మళ్లీ మళ్లీ అదరగొడుతున్న ఏజెంట్ ఫస్ట్ సింగిల్!
X

దిశ, సినిమా: అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'ఏజెంట్'. ఏప్రిల్ 28న రిలీజ్‌ కాబోతున్న సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. తాజాగా 'మళ్లీ మళ్లీ' అంటూ సాగే మొదటి పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మొదటిసారిగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో ఇంటరాక్ట్ అయిన అఖిల్.. పాటను యూనిక్ స్టయిల్‌లో ప్రమోట్ చేశాడు. అయితే ఇటీవల విడుదలచేసిన ఈ సాంగ్ ప్రోమో భారీ ప్రజాదరణ పొందగా.. ఈ పాటలో అఖిల్ అల్ట్రా స్టైలిష్‌గా కనిపించాడు.

లవ్లీ ఎక్స్‌ప్రెషన్స్, ఎట్రాక్టివ్ డ్యాన్స్ మూవ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హీరోయిన్ సాక్షి వైద్య కూడా అందంగా కనిపించింది. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ వీక్షకుల్ని కట్టిపడేయగా ఫారిన్‌లోని బ్యూటిఫుల్ లొకేషన్స్, విజువల్స్ కళ్లు చెదిరేలా ఉన్నాయి. ఇక మమ్ముట్టి కీలక పాత్ర పోషించిన చిత్రాన్ని ఎకె.ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామ బ్రహ్మం సుంకర నిర్మించగా.. హిప్ హాప్ తమిళ సంగీతం అందించాడు.

Advertisement

Next Story