OTT : ఐదుగురు భార్యలతో శోభనం, ఓటీటీలో సెన్సేషనల్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

by Kavitha |
OTT : ఐదుగురు భార్యలతో శోభనం, ఓటీటీలో సెన్సేషనల్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
X

దిశ, సినిమా: ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా పెరిగిపోయింది. ఆడియన్స్ థియేటర్స్ కంటే ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ మీదే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది బయటకు వెళ్లకుండా నచ్చిన సినిమా చూసి ఎంజాయ్ చేయవచ్చు. నచ్చిన జోనర్ ఎంచుకుని ఇంట్లో వండిన స్నాక్స్ తింటూ వీకెండ్ ఎంజాయ్ చేయవచ్చు. అందుకే ప్రతివారం సూపర్ హిట్ సినిమాలు, సిరీస్లు ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఓటీటీ సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలోనే రొమాంటీక్ సినిమాలను ఇష్టపడేవాళ్ల కోసం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఓ రొమాంటిక్ వెబ్ సిరీస్ ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ వెబ్ సిరీస్ పేరు ‘నరేంద్రన్ హనీమూన్స్’. కాగా ఈ సీరీస్‌లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. డబ్బు సంపాదించడానికి ఓ వ్యక్తి ఐదుగురు అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అది ఎలా? ఏంటి? అనేదే దీని అసలు స్టోరీ.

కథ విషయానికొస్తే..

హీరో అనారోగ్యంతో ఉన్న తన తల్లి సంపాదనతో జీవిస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు హీరో పాత స్నేహితుడు ఒకడు కువైట్ నుంచి తిరిగి వస్తాడు. ఇక అతన్ని చూసి అసూయ పడిన హీరో.. ఎలాగైనా తాను కూడా కువైట్ వెళ్లాలని అనుకుంటాడు. అదే విషయం అతని ఫ్రెండ్‌కు చెబితే.. అతను వీసా కోసం ముందు రూ.16,000 రెడీ చేసుకోవాలని చెప్తాడు. దీంతో ఆ డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచనలో పడతాడు హీరో. ఈ క్రమంలో పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల కట్నం డబ్బులు వస్తాయని ఆశపడతాడు. ముందుగా ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆమె దగ్గర డబ్బులు లేవని తెలుసుకుని.. ఆ తర్వాత మరో అమ్మాయిని చేసుకుంటాడు. అక్కడ కూడా సేమ్ సీన్. ఆ తర్వాత మరొకరిని ఇలా వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ తిరుగుతుంటాడు.. అలా ఐదుగురు భార్యలతో హనీమూన్ అనేది ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది? హీరో ఎలా తప్పించుకుంటాడు.? అనేది ఈ వెబ్ సిరీస్‌లో చూడాలి. మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్లి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో చూసేయండి.

Advertisement

Next Story