చివరకు అంతకు తెగించిన Manchu Lakshmi..

by Hamsa |   ( Updated:2022-12-08 06:41:32.0  )
చివరకు అంతకు తెగించిన Manchu Lakshmi..
X

దిశ, సినిమా: మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోహన్ బాబు కూతురు గా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని, మల్టీ టాలెంటెడ్ అంటూ ప్రూవ్ చేసుకుంది. ఇక సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి మంచి యాక్టర్స్ అనిపించుకోవాలంటే ఎలాంటి క్యారెక్టర్ అయిన చేయగలగాలి. కేవలం హీరోయిన్ గానే మెప్పిస్తాను అంటే కుదరదు. అలాంటి ఓ డేరింగ్ స్టెప్ వేసి అందరికీ షాక్ ఇచ్చింది స్టార్ కిడ్ మంచు లక్ష్మి . ఆమె లిప్ లాక్ సన్నివేశంలో నటించారు. కాగా, రీసెంట్ గా ఆమె మలయాళంలో నటించిన 'మోనాస్టర్' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంతేకాదు ఈ సినిమాలో ఫస్ట్ టైం లెస్బియన్ క్యారెక్టర్ లో మంచు లక్ష్మి నటించడం షాకింగ్ గా అనిపించింది. ఈ సినిమాలో మంచు లక్ష్మి పర్ఫామెన్స్ చూసి ఎవ్వరైనా సరే వల్గారిటీ గా ఆమెను ట్రోల్ చేయరు. ఆమెలో ఇంత మంచి నటి ఉందా..? ఇన్నాళ్లు మన తెలుగు ప్రజల గుర్తించలేకపోయారా..? అంటూ ప్రశంసలతో ముంచెత్తుతారు. దానిని ఛాలెంజింగ్ గా తీసుకున్న మంచు లక్ష్మి నటిగా ఓ మెట్టు ఎక్కేసింది అంటూ మంచు ఫ్యాన్స్ ఆమెను ఓ రేంజ్ లో మెచ్చుకుంటున్నారు. ఏది ఏమైనా సరే మంచు లక్ష్మి మల్టీ టాలెంటెడ్ అని మరోసారి ప్రూవ్ చేసుకుంది. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ క్రైమ్ థ్రిల్లర్ స్ట్రీమ్ అవుతుంది.

Advertisement

Next Story