Filmfare Awards-2024: అట్టహాసంగా ఫిల్మ్‌ఫేర్ (సౌత్) ఫెస్టివల్.. తెలుగులో ఉత్తమ చిత్రం అదే

by Shiva |   ( Updated:2024-08-04 03:08:29.0  )
Filmfare Awards-2024: అట్టహాసంగా ఫిల్మ్‌ఫేర్ (సౌత్) ఫెస్టివల్.. తెలుగులో ఉత్తమ చిత్రం అదే
X

దిశ, వెబ్‌డెస్క్: 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌-2024 వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో అట్టహాసంగా కొనసాగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ క్రమంలో వివిధ భాషల్లో నామినేషన్ల జాబితాలో ఉన్న విజేతలను వేదికపై ప్రకటించారు. అయితే, తెలుగు ఇండస్ట్రీ నుంచి తెలంగాణ నేపథ్యం ఆధారంగా రూపుదిద్దుకున్న ‘బలగం’ మూవీ తెలుగు నుంచి ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. అదేవిధంగా ఉత్తమ దర్శకుడిగా వేణు ఎల్దండి (బలగం), ఉత్తమ నటుడిగా నాని (దసరా), ఉత్తమ నటిగా కీర్తి సురేష్ (దసరా) ఎంపికయ్యారు. ఇక ఉత్తమ తొలి చిత్ర దర్శకులుగా శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యూవ్ (హాయ్ నాన్న) ఫిల్మ్‌ఫేర్‌ను సొంతం చేసుకున్నారు.

ఉత్తమ చిత్రంగా (క్రిటిక్స్‌) బేబి మూవీ, ఉత్తమ నటుడు (క్రిటిక్స్) నవీన్ పోలిశెట్టి (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి), ప్రకాశ్ రాజ్ (రంగమార్తాండ), ఉత్తమ నటి (క్రిటిక్స్), వైష్ణవి చైతన్య (బేబి) అవార్టులను సొంతం చేసుకున్నారు. అదేవిధంగా ఉత్తమ సహాయ నటుడిగా రవితేజ (వాల్తేరు వీరయ్య), బ్రహ్మానందం (రంగమార్తాండ), ఉత్తమ సహాయ నటి: రూపలక్ష్మి (బలగం)ని ఫిల్మ్‌ఫేర్ వరించింది. ఉత్తమ సంగీత దర్శకుడిగా విజయ్ బుల్గానిన్ (బేబి), ఉత్తమ గేయ రచయితగా ఆనంత్ శ్రీరామ్ (బేబి - ఓ రెండు ప్రేమ మేఘాలిలా), ఉత్తమ గాయకుడిగా: శ్రీరామచంద్ర (బేబి - ఓ రెండు ప్రేమ మేఘాలిలా), ఉత్తమ గాయని: శ్వేత మోహన్ (సార్ - మాస్టారు మాస్టారు), ఉత్తమ నృత్య దర్శకుడిగా ప్రేమ్ రక్షిత్ (దసరా - ధూమ్ ధామ్ దోస్తాన్), ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా సత్యన్ సూరన్ (దసరా), ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్‌గా: కొల్ల అవినాష్ (దసరా) ఫిల్మ్‌ఫేర్ అవార్టులను కైవసం చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed