అంత దిగ‌జార‌రు... క్యాస్టింగ్ కౌచ్‌పై పోసాని కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-10-05 13:56:13.0  )
అంత దిగ‌జార‌రు... క్యాస్టింగ్ కౌచ్‌పై పోసాని కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: సినీ ఇండస్ట్రీ(Film industry)లో ఎదగాలంటే అమ్మాయిలు క్యాస్టింగ్ కౌచ్‌(Casting couch)కు ఒప్పుకోవాల్సిందేనని పలువురు నటీమణులు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కెరీర్ తొలినాళ్లలో వాళ్లకు ఎదురైన అనుభవాలను చాలా సందర్భాల్లో బహిరంగంగానే ప్రస్తావించారు. సినిమాల్లో అవకాశాల పేరు చెప్పి కొందరు కోఆర్డినేటర్లు వ్యవహరించిన తీరును చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా కొందరి చేష్టలతో సినిమా రంగంలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనే ముద్ర పడింది. ఈ నేపథ్యంలో సినీ నటుడు పోసాని కృష్ణ మురళి(Film actor Posani Krishna Murali) షాకింగ్ కామెంట్స్ చేశారు. సినిమా ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదని ఆయన స్పష్టం చేశారు. సినిమాల్లో అవ‌కాశాల కోసం అమ్మాయిలు అంత దిగ‌జార‌రని చెప్పారు. సినిమా కోసం ఎలాంటి స్త్రీ అయినా క‌మిట్‌మెంట్‌కు ఎందుకు ఒప్పుకుంటుందన్నారు. ఒక‌వేళ సినిమా హిట్ అవ‌క‌పోతే తమ ప‌రిస్థితేంటనే స్పృహ వారికి ఉంటుందని పోసాని కృష్ణమురళి తెలిపారు.

Advertisement

Next Story