- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పవన్ కళ్యాణ్‌కు ఛార్మీకి మధ్య గొడవ.. అసలు ఆ రోజు పార్టీలో ఏం జరిగింది..?
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అన్నదమ్ములైన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాగబాబు ఎదుటివారిని చాలా గౌరవిస్తారు. ఇతరులను అసలు చులకన చేసి మాట్లాడరు. అలాంటి ఫ్యామిలీని ఓ తెలుగు హీరోయిన్ కించపరుస్తూ మాట్లాడిందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. అప్పట్లో అగ్ర హీరోల సరసన నటించి, మంచి గుర్తింపు దక్కించుకున్న ఛార్మీ కౌర్. అయితే గతంలో ఛార్మీ ఓ స్టార్ హీరో పుట్టినరోజు పార్టీకి హాజరైందట. ఈ క్రమంలో అక్కడ అందరూ మద్యం తాగారట. ఆ సమయంలో ఛార్మీ మెగా ఫ్యామిలీ గురించి కాస్త రూడ్‌గా మాట్లాడిందట. ఈ విషయం పవన్ కల్యాణ్ చెవిన పడటంతో వెంటనే స్పందించి.. గొడవకు దిగారట. దీంతో గొడవ కాస్త పెద్దదవ్వడంతో పక్కన ఉన్నవారు ఆ గొడవను ఆపే పరిస్థితి వచ్చిందట.
ఇక అప్పటి నుంచి పవన్‌తో పాటు మెగా ఫ్యామిలీ అంతా ఛార్మీతో మాట్లాడలేదట. అలాగే కలిసి సినిమాల్లో కూడా నటించకపోవడానికి కారణం కూడా ఇదేనంటూ టాక్ నడుస్తుంది. ఈ వార్తలో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ నగర్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.