అత్యుత్సాహంతో స్టార్ హీరో విజయ్ కారును ధ్వంసం చేసిన అభిమానులు (వీడియో)

by sudharani |   ( Updated:2024-03-22 14:12:18.0  )
అత్యుత్సాహంతో స్టార్ హీరో విజయ్ కారును ధ్వంసం చేసిన అభిమానులు (వీడియో)
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం ‘ద గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)’ సినిమాతో బిజీగా ఉన్నాడు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వెంకట ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని సమ్మర్ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే షూటింగ్ వేగంగా ఫినిష్ చేసుకునే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కేరళలో జరుగనుంది. దీని కోసం వారం రోజుల పాటు మూవీ టీం అక్కడ ఉండేందుకు కేరళాకు చేరుకున్నారు.

ఈ క్రమంలోనే దాదాపు 14 ఏళ్లు తర్వాత తన అభిమాన హీరో విజయ్ కేరళ వస్తున్నాడని తెలుసుకున్న ఫ్యాన్స్.. ఎయిర్‌పోర్ట్‌కు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అక్కడ నుంచి విజయ్ కారులో ప్రయాణిస్తున్న సమయంలో తోపులాట జరిగింది. ఇక ఫ్యాన్స్ రద్ధీ కూడా ఎక్కువ కావడంతో కారు డ్రైవర్ దగ్గర ఉండే అద్దం పగిలిపోయింది. అలాగే కారు కూడా ధ్వంసం అయింది. అక్కడక్కడ చొట్టలు పడ్డాయి. అయితే.. ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఫ్యాన్స్ అత్యుత్సాహంతో బద్దలైన కారుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

Next Story