- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'యామీ' ని పాలకూర, పుదీనాతో పోల్చిన అభిమాని..
దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. 'నువ్విలా', 'గౌరవం', 'కొరియర్ బాయ్ కళ్యాణ్' లాంటి చిత్రాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న భామ.. ఓటీటీలో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. 'ఎ థర్స్‌డే', 'దస్వీ' వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్‌తో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే 'దస్వీ' ప్రమోషన్స్‌లో కపిల్ శర్మ షోకు అటెండ్ అయిన ఆమెకు.. తన డ్రెసింగ్‌పై వచ్చిన ఫన్నీ కామెంట్స్‌ను చూపించాడు కపిల్. గ్రీన్ కలర్ సూట్‌లో దిగిన ఫొటోలకు వచ్చిన రెస్పాన్స్ చూపించి నవ్వించాడు. 'నిన్ను కొత్తిమీర అననా లేక పాలకూర? లేదా పుదీనా?. ఎలా పిలవాలో అర్థం కావడం లేదు కానీ నువ్వే ప్రపంచం' అనే అభిమాని కామెంట్‌ను ప్రత్యేకంగా చూపించాడు. దీంతో ఈ షో చూసిన అందరూ ఈ ఫొటో అండ్ కామెంట్ చూసేందుకు ఇన్‌స్టాగ్రామ్‌కు వెళ్లగా భారీ లైక్స్, షేర్స్‌తో వైరల్ అయింది. దీంతో మోత్తానికి యామీ.. 'యమ్మీ పాలకూర' అయిపోయింది అంటున్నారు నెటిజన్స్.
- Tags
- Yami Gautam