- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సలార్’ టికెట్ కోసం థియేటర్స్ వద్ద బారులు తీరిన ఫ్యాన్స్.. లాఠీ చార్జ్ చేసిన పోలీసులు (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సలార్’. దీనిని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ భారీ హైప్‌ను క్రియోట్ చేశాయి. అయితే ఈ చిత్రం డిసెంబర్ 22న థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. సలార్’ సినిమాను నైజాంలో విడుదల చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కొత్త ప్రయోగం చేసింది. ప్రస్తుతం ఏ సినిమాకైనా అడ్వాన్స్ బుకింగ్స్ ఆన్‌లైన్‌లోనే ఇస్తున్నారు. కానీ, ‘సలార్’ సినిమాకు మాత్రం నైజాంలో కొన్ని ఎంపిక చేసిన థియేటర్ల వద్ద ఈరోజు ముందుగా ఆఫ్‌లైన్ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేశారు.
హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సంధ్య 70 ఎంఎం, థియేటర్ వద్ద ఈరోజు సాయంత్రం ‘సలార్’ టికెట్లు విక్రయించారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ భారీగా థియేటర్ వద్దకు చేరుకున్నారు. ఇక టికెట్లు ఇచ్చే సమయానికి గేట్లు తెరవగా ఒక్కసారి అభిమానులు అందరూ పరుగులు పెట్టారు. టికెట్ కౌంటర్ వద్ద క్యూలో నిలబడడానికి పోటీపడ్డారు. దీంతో కుమ్ములాట జరిగింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో అవి చూసిన వారు మైత్రీ మూవీ మేకర్స్‌ను తిట్టిపోస్తున్నారు. ఆన్‌లైన్ బుకింగ్స్ పెడితే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకునేవి కాదుగా అని ఫైర్ అవుతున్నారు.
- Tags
- Salaar