ప్యూర్ హార్ట్.. ఫ్యాన్స్‌ను రిసీవ్ చేసుకోవడంలో రామ్ చరణ్ తర్వాతే ఎవరైనా!

by Anjali |   ( Updated:2024-01-01 14:39:54.0  )
Ram Charanm
X

దిశ, సినిమా: తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడం చాలా ఈజీ.. కానీ, తండ్రిని మించిన తనయుడు అనిపించుకోవడం మాత్రం చాలా కష్టం. ఎంతో శ్రమ చేస్తే తప్ప ఆ పేరు ఎవరికి రాదు. కానీ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయంలో మాత్రం ఇది నిజమైంది. తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోని అనేక మంది యంగ్ హీరోలంతా చిరు అభిమానులే. ఈ విషయాన్ని స్వయంగా హీరోలే పలు సందర్భాల్లో చెబుతుండటం విశేషం. ఆ అభిమానులకు చిరంజీవి కూడా ఎంత రెస్పెక్ట్ ఇస్తారో అందరికీ తెలిసిందే. చిరు తర్వాత రామ్ చరణ్ కూడా అభిమానులకు అంతే ప్రయారిటీ ఇస్తున్నారు. చరణ్ కలవడానికి ఎవరు వచ్చినా సమయం లేదు అనకుండా వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చేస్తున్నారు.

తాజాగా.. గేమ్ చేంజర్ షూటింగ్ నిమ్మిత్తం రామ్ చరణ్ మైసూర్‌కు వెళ్లారు. ఈ క్రమంలో షూటింగ్ స్పాట్‌కు కొంతమంది అభిమానులు ఆయన్ను కలవడానికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న చరణ్ షూటింగ్‌కు కాస్త గ్యాప్ ఇచ్చి మరీ వారిని కలిశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఇది గమనించిన అభిమానులు.. ఫ్యాన్స్‌ను రిసీవ్ చేసుకోవడంలో నీ తర్వాతే ఎవరైనా అన్నయ్య.. స్వచ్ఛమైన మనసు నీది అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Next Story