Deepika Padukone: దీపికా పదుకొణె గారాల పట్టికి అప్పుడే పేరు పెట్టేసిన అభిమానులు

by Anjali |   ( Updated:2024-09-09 14:55:39.0  )
Deepika Padukone: దీపికా పదుకొణె గారాల పట్టికి అప్పుడే పేరు పెట్టేసిన అభిమానులు
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె నిన్న (సెప్టెంబరు 8) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో పలువురు సెలబ్రిటీలు (అలియా భట్, శ్రేయా ఘోషల్, ప్రియాంక చోప్రా, అర్జున్ కపూర్, బిపాసా బసు, రుబీనా దిలైక) అండ్ అభిమానులు సోషల్ మీడియా వేదికన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆదివారం ఉదయం ముంబయిలోని హెచ్‌ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌లో జన్మించిన రణవీర్ సింగ్ అండ్ దీపికా గారాల పట్టికి ఫ్యాన్స్ అప్పుడే పేరు కూడా పెట్టారు. ప్రస్తుతం ఈ బుజ్జాయిని ఫ్యాన్స్ బేబీ సింగ్ పదుకొణె అని పిలుస్తున్నారు. పలువురు బాలీవుడ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలు క్వీన్ అంటున్నారు.ఇక దీపికా, రణవీర్ సింగ్ 2018 లో నవంబర్‌లో వివాహం చేసుకొన్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో దీపికా గర్భవతి అయ్యింది. సెప్టెంబర్ 2024 అనే క్యాప్షన్‌ జోడించి.. బేబీ షూస్, దుస్తులతో కూడిన క్యూట్ ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో అభిమానులకు క్లారిటీ వచ్చేసింది. నేడు దీపికా-రణవీర్ తల్లిదండ్రులయ్యారు.

Advertisement

Next Story