అంత రిస్క్ అవసరమా..! ‘టిల్లు స్క్వేర్’ రన్ టైంతో ఫ్యాన్స్ అసంతృప్తి

by sudharani |
అంత రిస్క్ అవసరమా..! ‘టిల్లు స్క్వేర్’ రన్ టైంతో ఫ్యాన్స్ అసంతృప్తి
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో నుంచి ఇప్పటికే రిలీజైన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పోస్టర్లు, గ్లింప్స్‌తో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే.. డీజే టిల్లుకు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతకు నిరాశే మిగిలేలా చేస్తున్నారు మేకర్స్.

ఎందుకంటే.. ఇందులో ఎన్నో రొమాంటిక్ సీన్స్ ఉంటాయని ఎంతో ఊహించుకున్నారు. కానీ సెన్సార్ యూ/ఎ సర్టిఫికెట్‌తో అంతా కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు మరోసారి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే.. తాజాగా ఈ మూవీ రన్ టైం కు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మూవీ 2 గంటల కంటే తక్కువ నిడివి మాత్రమే ఉంటుందట. దీంతో రన్ టైం కూడా రిస్క్ ఫ్యాక్టర్‌ని మరింత పెంచేలా ఉందనే మాట వినిపించడంతో.. కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందకు సిద్ధంగా ఉంది.

Advertisement

Next Story