షారుఖ్ స్మోకింగ్‌, గ్లామర్‌పై నెట్టింట ఆసక్తికర సంభాషణ.. ట్వీట్స్ వైరల్

by sudharani |   ( Updated:2023-06-13 12:03:02.0  )
షారుఖ్ స్మోకింగ్‌, గ్లామర్‌పై నెట్టింట ఆసక్తికర సంభాషణ.. ట్వీట్స్ వైరల్
X

దిశ, సినిమా: షారుఖ్ ఖాన్, తన అభిమానుల మధ్య ట్విట్టర్‌లో ఆసక్తికర సంభాషణ జరిగింది. తాజాగా బాద్‌షా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌ నిర్వహించగా.. ఒక అభిమాని ‘మీరు స్మోకింగ్ మానేశారా? అని అడిగాడు. దీంతో.. లేదు అంటూనే అబద్ధం చెప్పానని ఒప్పుకున్నాడు షారుఖ్. క్యాన్సర్ స్టిక్(సిగరెట్) నుంచి వచ్చే దట్టమైన పొగతో చుట్టుముట్టబడి ఉన్నట్లు తెలిపాడు. అలాగే ‘నిజంగా నువ్వు అందంగా ఉన్నావని అనుకుంటున్నావా?’ అని మరొకరు అడగ్గా.. ‘నో నాట్ ఎట్ ఆల్. నేను హ్యాండ్సమ్‌గా ఉన్నానని నాకు తెలుసు’ అన్నాడు. చివరగా ‘ఇతర స్టార్స్ దగ్గర లేనిది? మీ దగ్గర ఉన్నదేంటి?’ అని ప్రశ్నించగా.. ‘డీడీఎల్‌‌జే, కేకేహెచ్‌హెచ్, దేవదాస్, స్వదేశ్, చక్ దే ఇండియా, పఠాన్, ఓం శాంతి ఓం’ ఉన్నాయంటూ తన సినిమా పేర్లు చెప్పడం విశేషం. కాగా ఈ ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story