‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీ డీల్ క్లోజ్.. ఎందులో అంటే?

by Kavitha |   ( Updated:2024-03-19 08:33:16.0  )
‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీ డీల్ క్లోజ్.. ఎందులో అంటే?
X

దిశ, సినిమా: టాలీవుడ్ రౌడీ హీరోగా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తాజాగా ‘ఫ్యామిలీ స్టార్‌’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా పరుశరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ కూడా అందుకున్నాయి.

అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ డీల్ క్లోజ్ అయినట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ‘ఫ్యామిలీ స్టార్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుందట. దీనికి సంబంధించిన వివరాలు మార్చి 19న అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓటీటీ డీల్ క్లోజ్ కావడంతో థియేట్రికల్ బిజనెస్‌పై కూడా నిర్మాతలు ఫోకస్ చేశారట. అంటే దిల్ రాజుకు పర్మనెంట్ డిస్ట్రిబ్యూటర్స్ ఉండగా.. కొన్ని ఏరియాల్లో సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారని టాక్.

Read More..

ఎన్టీఆర్ - సమీరారెడ్డి బ్రేకప్‌కు ఆ ప్రముఖ పొలిటిషియన్ కారణమా?

Advertisement

Next Story