అభిమానులను అలరిస్తున్న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ టైటిల్ సాంగ్

by sudharani |
అభిమానులను అలరిస్తున్న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ టైటిల్ సాంగ్
X

దిశ, సినిమా: నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్‌పై టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి నిర్మించిన చిత్రం మార్చి 17న విడుదలకానుంది. అయితే సినిమానుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, మొదటి పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా తాజాగా చిత్రం నుంచి ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ అంటూ సాగే టైటిల్ సాంగ్ విడుదలచేశారు మేకర్స్.

ఈ సందర్భంగా మాట్లాడిన గీత రచయిత భాస్కర భట్ల.. ‘ఇది హీరోహీరోయిన్ల పరిచయ గీతంగా చెప్పుకోవచ్చు. వారిద్దరూ అసలు ఎవరు? ఒకరికొకరు ఎలా పరిచయం అయ్యారు? దాని పరిణామ క్రమం ఏమిటి? కలసిన తర్వాత వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏమిటి? అది ఎలా సాగిందో ఇందులో చెప్పే ప్రయత్నం చేశా. అద్భుతంగా వచ్చిన ఈ పాట అభిమానులను అలరిస్తుందనే నమ్మకముంది’ అన్నాడు.

Advertisement

Next Story

Most Viewed