‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఓ భిన్నమైన కథ: శ్రీనివాస్ అవసరాల

by sudharani |
‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఓ భిన్నమైన కథ: శ్రీనివాస్ అవసరాల
X

దిశ, సినిమా: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. శ్రీనివాస్ అవసరాల తెరకెక్కించిన మూవీలో నాగశౌర్య, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా నటించారు. మార్చి 17న ఈ చిత్రం విడుదలకాబోతున్న నేపథ్యంలో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నాడు శ్రీనివాస్ అవసరాల. ‘ఇది చాలా సహజంగా ఉండే సినిమా. నిజంగా ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుందో అంత సహజంగా ఉంటుంది.

నిజ జీవితంలో కొన్ని సంఘటనల ఆధారంగా ఈ కథ రాసుకున్నా. ఇది జనాలకు దగ్గరగా ఉండే కథ. కొత్తగా ఏముంది అనేది మీకు సినిమా చూసిన తరువాత అర్థమవుతుంది. నా గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. ఈ సినిమాపై మా అందరితోపాటు నాగశౌర్య చాలా నమ్మకంగా ఉన్నాడు. ‘బిఫోర్‌ సన్‌రైజ్‌’ నాకు చాలా ఇష్టమైన సినిమా. నానితో సినిమా చేయాలని ఉంది. తృప్తినిచ్చే పాత్రలు మాత్రమే చేస్తూ ఎక్కువగా రచన, దర్శకత్వం మీద దృష్టి పెట్టాలనుకుంటున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి : నెదర్లాండ్‌లో పాప్ సింగర్‌‌తో స్టెప్పులేసిన అల్లు అర్జున్

Advertisement

Next Story

Most Viewed