BREAKING: ఆర్జీవీ ఆఫీస్ ఎదుట తీవ్ర ఉద్రిక్తత.. వ్యూహం సినిమా పోస్టర్లు దగ్ధం

by Satheesh |   ( Updated:2023-12-25 15:11:36.0  )
BREAKING: ఆర్జీవీ ఆఫీస్ ఎదుట తీవ్ర ఉద్రిక్తత.. వ్యూహం సినిమా పోస్టర్లు దగ్ధం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన వ్యూహం సినిమాకు వ్యతిరేకంగా కొందరు ఆందోళనకు దిగారు. ఆర్జీవీ ఆఫీస్ ఎదుట వ్యూహం మూవీ పోస్టర్లు తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 29వ తేదీన విడుదల కానున్న వ్యూహం సినిమాను బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆర్జీవీ ఆఫీస్ ఎదుట నిరసన చేస్తోన్న ఆందోళనకారులను చెదరగొట్టారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఆధారంగా ఆర్జీవీ వ్యూహం సినిమాను తెరకెక్కించారు. 2009 నుండి 2014 వరకు జగన్ పొలిటికల్ కెరీర్‌లో జరిగిన సంఘటనలను ఆర్జీవీ ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు సమాచారం. అయితే, ఈ సినిమాను టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వ్యూహం సినిమాను టీడీపీ అధినేత చంద్రబాబును కించపర్చే విధంగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు. దీంతో వ్యూహం సినిమా ఏపీ పాలిటిక్స్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇక, ఈ నెల 29వ తేదీన విడుదలకు వ్యూహం సినిమా సిద్ధంగా ఉంది.

Read More..

డిసెంబర్ చివరి వారంలో ఓటీటీ బ్లాక్ బస్టర్ మూవీలు ఇవే.!

Advertisement

Next Story