- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తన మద్దతు ఎవరికో తెలుపుతూ.. మానిప్యులేటర్‌కి కాకుండా నిజమైన నాయకుడికి ఓటు వేయండి అంటూ నటి పోస్ట్!
దిశ, సినిమా: పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆయనకు మద్దతుగా బుల్లితెర సెలబ్రిటీలతో పాటుగా టాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్స్ సైతం సపోర్ట్‌గా ఉంటున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు గెలుపు సాధించాలని ఓ వీడియో షేర్ చేశాడు. ఆ తర్వాత రామ్ చరణ్, అల్లు అర్జున్, నాని, కార్తికేయ, ఆది పలువురు స్టార్స్ పవన్ కల్యాణ్‌కు మద్దతు ప్రకటించారు. రోజు రోజుకు పవన్ కల్యాణ్ క్రేజ్ మరింత పెరుగుతూ వస్తుంది.
పోలింగ్‌కు కొద్ది సమయమే ఉన్నప్పటికీ ఇప్పటికీ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీకి చెందినే వారే కాకుండా కోలీవుడ్‌కు చెందిన వారు కూడా మద్దతు పవన్‌కే అని చెప్తున్నారు. తాజాగా, నటి నందిని రాయ్ ట్విట్టర్ వేదికగా తన మద్దతు ఎవరికో తెలుపుతూ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ‘‘ఒక్క రోజులో మీరు తీసుకునే నిర్ణయం రానున్న ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి వేయండి. మ్యానిపులేటర్లకు కాకుండా.. నిజమైన నాయకుడికి ఓటు వేయండి. నా సపోర్ట్ పవన్ కల్యాణ్ సర్‌కే. సినీ సెలబ్రిటీలే కాదు ఆ దేవుడు కూడా ఆయన వైపే ఉన్నాడు.
ఈ సారి ఎన్నికల్లో భారీ మెజార్టీతో పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలవబోతున్నారు. మీరు మా నాయకుడు కావాలని నేను బలంగా కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఆల్ ది బెస్ట్’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌పై నెట్టింట పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. అంటే జగన్‌ను నందినీరాయ్ మానుపులేటర్ అన్నదా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.