'బిచ్చగాడు 2' మూవీ నుండి అదిరిపోయే అప్డేట్..

by Hamsa |   ( Updated:2023-02-10 03:56:34.0  )
బిచ్చగాడు 2 మూవీ నుండి అదిరిపోయే అప్డేట్..
X

దిశ, వెబ్ డెస్క్: తమిళ డైరెక్టర్ విజయ్ ఆంటోని హీరోగా పలు సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. తమిళ్ చిత్రం 'పిచైకారన్' సినిమాను తెలుగులో 'బిచ్చగాడు' గా 2016 మార్చి 4న విడుదల చేసి మంచి విజయాన్ని సాధించాడు. బిచ్చగాడు కు సిక్వెల్‌గా 'బిచ్చగాడు-2' తీసుకొస్తునట్టు విజయ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బిచ్చగాడు 2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. మలేషియాలో షూటింగ్ జరుగుతుండగా విజయ్ ప్రమాదానికి గురయ్యారు. సర్జరీ కూడా చేయించుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. తాజాగా, బిచ్చగాడు 2 నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు విజయ్. ఈ మూవీ ట్రైలర్‌ను ఈరోజు 5 గంటలకు విడుదల చేస్తునట్టు ఈ వేసవిలో థియేటర్స్‌కు వస్తునట్టు ప్రకటించాడు. అంతేకాకుండా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ 'డబ్బులు ప్రపంచాన్ని చెడగొడతాయి' అనే క్యాప్షన్ ను జత చేశాడు.

ఇవి కూడా చదవండి : Prakash Raj అర్బన్ నక్సలైట్:Vivek Agnihothri (వీడియో)


Advertisement

Next Story