డార్లింగ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్..‘కన్నప్ప’ సెట్‌లోకి ప్రభాస్..!

by sudharani |   ( Updated:2024-01-30 11:39:25.0  )
డార్లింగ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్..‘కన్నప్ప’ సెట్‌లోకి ప్రభాస్..!
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న ఈ పౌరాణిక కథలో.. మోహన్ లాల్, శివరాజ్ కుమార్‌తో పాటు ప్రభాస్ కూడా కీలకపాత్రలో నటించబోతున్నారు. అయితే.. ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శివుడిగా కనిపించబోతున్నాడు. ఇక పార్వతి పాత్రలో నయనతార నటించనున్నట్లు టాక్.

అయితే.. త్వరలో శివపార్వతికి సంబంధించిన పార్ట్‌ని షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ క్రమంలోనే ఫిబ్రవరి మూడో వారంలో ప్రభాస్ ‘కన్నప్ప’ సెట్‌లో అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. దీని కోసం మూడు రోజుల కాల్ షీట్స్‌ని ఇచ్చాడట ప్రభాస్. ఈ సినిమా మొత్తానికి శివుని పాత్ర హైలెట్ అని నెట్టింట ప్రచారం జరుగుతోంది. కాగా.. ప్రభాస్‌ను ఎప్పుడెప్పుడు శివుడు పాత్రలో చూస్తామని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న డార్లిగ్ ఫ్యాన్స్‌కు ఇది మంచి కిక్ ఇచ్చే న్యూస్ అని చెప్పుకోవచ్చు.

Advertisement

Next Story