- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతి ఇంట్లో ఒక మంచు లక్ష్మీ ఉంది: ట్రోలింగ్‌పై నటి సీరియస్
దిశ, సినిమా: సీనియర్ హీరో మోహన్‌బాబు డాటర్ మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే తనపై వచ్చే ట్రోల్స్‌పై కూడా స్పందించింది.
'మన పుట్టుకకు ఒక అర్థం ఉండాలి. అందుకే ప్రతిదాన్ని నేను చాలా సీరియస్‌గా తీసుకుంటా. నా గురించి వచ్చిన ట్రోల్స్ విని గతంలో బాధపడేదాన్ని. కానీ, ఇప్పుడు అంత సీన్ లేదు. నేను అస్సలు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పుడు అందరూ నాలాగే మాట్లాడుతున్నారు. ప్రతి ఇంట్లో ఒక మంచు లక్ష్మి ఉంది. ఇంకో విషయమేమిటంటే మా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు ప్రైవేటుగానే ఉంచుతాం. పరిస్థితిని బట్టి అందరంకలిసి ఒక చోట కనిపిస్తాం. మా ఇంట్లో ఏం జరుగుతుందనేది మా సొంత విషయం. నేను, మనోజ్ ఎక్కువగా కలుస్తుంటాం. అందువల్ల బయట మేము ఇద్దరం మాత్రమే కనిపిస్తాం' అని తెలిపింది.