పెళ్లైన వాళ్లు కూడా దాని కోసమే వెతుకులాట Payal Rajput ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. నెటిజన్లు ఫైర్‌

by Hamsa |   ( Updated:2023-08-10 05:02:54.0  )
పెళ్లైన వాళ్లు కూడా దాని కోసమే వెతుకులాట Payal Rajput ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. నెటిజన్లు ఫైర్‌
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ‘ఆర్‌ఎక్స్-100’ సినిమాతో ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే అందరి హృదయాల్లో చెదరని ముద్ర వేసింది. ఆ తర్వాత వెంకీమామ, డిస్కో రాజా, తీస్‌మార్‌ ఖాన్ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ అమ్మడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అందమైన పొటోలను షేర్ చేస్తుంది. తాజాగా, పాయల్ తన ఇన్‌స్టా స్టోరీలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘ నీకు ఇంకా సోల్‌మెట్ దొరకలేదని బాధపడకు. ఎందుకంటే పెళ్లైన వాళ్లు కూడా తమ సోల్‌మెట్‌ల కోసం వెతుకుతున్నారు’’ అంటూ రాసుకొచ్చింది. ఇది కాస్త నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కొందరు భారతీయ పెళ్లి వ్యవస్థను పాయల్ రాజ్‌పుత్ అవమానించిందంటూ మండిపడుతున్నారు. మరి కొందరు మాత్రం ఇందులో తప్పేమీ లేదని ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు.

Also Read: లైగర్ ఎఫెక్ట్.. ఇకపై నోరుమూసుకొని ఉంటా అంటున్న Vijay Deverakonda



Advertisement

Next Story