ఆ టైంలో చనిపోదామనుకున్నా.. అస్సలు బతకాలని లేకుండే: జబర్దస్త్ స్టార్ నటి

by Anjali |   ( Updated:2023-07-23 15:19:17.0  )
ఆ టైంలో చనిపోదామనుకున్నా.. అస్సలు బతకాలని లేకుండే: జబర్దస్త్ స్టార్ నటి
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర పాపులర్ షో ‘‘జబర్దస్త్’’తో నెటిజన్లకు పరిచయమయ్యింది నటి వర్ష. కొంతమంది ఈ బ్యూటీ ఫ్యాన్స్ జూనియర్ సమంత అని పిలిచే విషయం తెలిసిందే. ఇటీవల ఆమెకు సినిమా అవకాశాలు వచ్చాయంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘‘బుల్లితెరను వదలడం నాకు ఇష్టం లేదు. ఈ కారణంగా అప్పట్లో నేను మూవీ ఆఫర్లు మిస్ చేసుకున్నాను. నాకు హీరోయిన్‌గా చేయాలని పెద్దగా కోరికలేం లేవు. ఫ్రెండ్, వదిన, అక్క లాంటి సైడ్ క్యారెక్టర్ పాత్రలో మాత్రమే నటిస్తాను. త్వరలో ఒక పెద్ద షోకు హాజరవుతున్నాను. నా స్టడీ, వ్యక్తిగత విషయాల గురించి అక్కడ చెప్తానంటూ’’ వర్ష చెప్పుకొచ్చారు.

అలాగే, ఈ సందర్భంగా.. వర్ష చిన్న అన్నయ్య యాక్సిడెంట్ గురించి వెల్లడించారు. ‘2 ఏళ్ల కిందట మా చిన్న అన్నయ్యకు యాక్సిడెంట్ అయ్యింది. అతడి బ్రెయిన్‌లో బ్లడ్ గడ్డ కట్టడంతో బతకడం కష్టమని వైద్యులు చెప్పారు. ఆ టైంలో నేను డాక్టర్ కాళ్లు పట్టుకుని ఎంత మనీ ఖర్చైనా మా అన్నయ్యను బతికించండి అని బాగా బతిమిలాడాను. రెండు రోజులు వాష్ రూం బయటే పడుకున్నాను. అన్నయ్య పరిస్థితి చూసి చనిపోదామనుకున్నా. ఆయన అంటే నాకు పంచ ప్రాణాలు. కొన్ని రోజుల తర్వాత అన్నయ్య కోలుకున్నాడు.’’ అని వర్ష ఎమోషనల్ అవుతూ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed