ఆ టైప్ క్యారెక్టర్లు చేయడం నా వల్ల కాదు.. ట్విస్ట్‌లుండాలంటున్న ఈషా

by Prasanna |   ( Updated:2023-10-01 08:00:50.0  )
ఆ టైప్ క్యారెక్టర్లు చేయడం నా వల్ల కాదు.. ట్విస్ట్‌లుండాలంటున్న ఈషా
X

దిశ, సినిమా: ప్రముఖ దర్శకుడు హర్షవర్ధన్ డైరెక్షన్‌లో పనిచేయడం గొప్పగా ఉంటుందంటోంది ఈషా రెబ్బా. సుధీర్ బాబు హీరోగా హర్షవర్ధన్ తెరకెక్కించిన ‘మామా మశ్చీంద్ర’లో హీరోయిన్‌గా నటించిన ఆమె మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ మేరకు సినిమాకోసం హీరోయిన్‌గా సుధీర్ తన పేరు సూచించాడని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని, కామెడీ, ఎమోషన్ అండ్ థ్రిల్ స్టోరీలో ఛాన్స్ దక్కడం లక్కీగానే భావిస్తానంది. ఇక తను పోషించిన వైరల్ విశాలాక్షి పాత్ర అందరినీ అలరిస్తుందన్న నటి.. ఈ సినిమా ఎవరి ఊహలకందని విధంగా తీర్చిదిద్దారని, ప్రతి పదినిమిషాలకు ఒక సర్‌ప్రైజ్, ట్విస్ట్‌లుంటాయని చెప్పింది. ‘అరవింత సమేత’ తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయన్న ఈషా ఒకే తరహా పాత్రలు పోషించలేక నో చెప్పానంది. చివరగా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడానికి ఇష్టపడతానని, తెలుగుతోపాటు తమిళంలోనూ ఓ సినిమా చేస్తున్నానన్న ఆమె ‘మామా మాశ్చీంద్ర’ స్టోరీలో సీక్వెల్ తీసేంత స్కోప్ ఉందంటూ మనసులో మాట బయటపెట్టింది.

Advertisement

Next Story

Most Viewed