- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆంధ్రాలో RGV.. కోడిపందెలతో ఎంజాయ్!
దిశ, వెబ్‌డెస్క్: వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. ఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో ఆయన మూడు రోజులుగా తిరుగుతూ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కోడి పందెలను వీక్షించారు. ఆదివారం సంక్రాంతి సందర్భంగా కాకినాడకు వెళ్లిన ఆర్జీవీ.. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో మీడియా కెమెరాలకు చిక్కారు. ద్వారంపూడితోపాటు ఆయన కుటుంబ సభ్యులతో మాటామంతీ కలిపారు. ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ మీడియాతో మాట్లాడుతూ తన ఫ్రెండ్స్ పిలిస్తే ఇక్కడికి వచ్చానని చెప్పారు. ఆంధ్రా ప్రజల మధ్య సంక్రాంతి పండుగ పరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. తాను ఆంధ్రా రావడంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదన్నారు. ఆర్జీవీపై నాగబాబు చేసిన కామెంట్స్‌పై మీడియా ప్రశ్నించగా.. నిరాకరించిన వర్మ.. తాను నాగబాబు చేసిన వ్యాఖ్యలు వినలేదని చెప్పారు. అవ్వి చూసిన తర్వాతనే స్పందిస్తానని తెలిపారు.
కాగా, నాగబాబు ట్విట్టర్ వేదికగా ఆర్జీవీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ''తాను కులాన్ని గౌరవిస్తానని, కానీ తనకు కుల పిచ్చి లేదు. రాంగోపాల్ వర్మ అనే వాడు పెద్ద ఎదవ. అలాంటి సన్నాసి.. నీచ్, కమీనే, కుత్తేగాడు ఇండస్ట్రీలో లేడు. వాడు అవసరం కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు.కాబట్టి వాడి గురించి నేను మాట్లాడను. నేను కాపు సామాజికవర్గంలో పుట్టాను.. కులాన్ని గౌరవిస్తాను.. కులపిచ్చి లేదు. కాపు కులాన్ని ఎంత గౌరవిస్తానో అన్ని కులాలను అంతే గౌరవిస్తాను. కానీ, ఒక కులాన్ని పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడితే అతి చాలా పెద్ద తప్పు. చాలా మంది మాట్లాడుతున్నారు. కాపు కులమే కాదు.. ఏ కులమైనా ఎందుకు అమ్ముడుపోతుంది? అంత ఆత్మాభిమానం లేకుండా బతుకుతున్నారా ప్రజలు? అంటే మనుషుల్ని ఎంత చులకనగా చూస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతోంది'' అని నాగబాబు ట్విట్టర్‌లో మండిపడ్డారు.
కేక పుట్టిస్తున్న అన్‌స్టాపబుల్ షో బాలయ్య, పవన్ ఎపిసోడ్ ఫస్ట్ గ్లిమ్స్
బాలకృష్ణ ఆ మాట అనడం సిగ్గుచేటు: మంత్రి రోజా ఫైర్