‘Khushi’ నుంచి ఎమోషనల్ సాంగ్ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్

by samatah |   ( Updated:2023-08-17 09:03:43.0  )
‘Khushi’ నుంచి ఎమోషనల్ సాంగ్ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్
X

దిశ, సినిమా: విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతోంది. ఇక ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ ఆకట్టుకోగా.. ఇందులో మూడు పాటలు అయితే సూపర్ డూపర్‌గా ఉన్నాయి. ఈ సాంగ్స్‌తోనే మూవీపై హైప్ పీక్స్‌కు చేరుకుంది. కాగా తాజాగా ఇప్పుడు నాలుగో పాట కూడా రిలీజ్ కాబోతుంది. ఈ రోజు ఈ సాంగ్ సాయంత్రం 6 గంటల 3 నిముషాలకు రిలీజ్ కానుందని మూవీ టీమ్ ప్రకటించింది. ‘ఎదకు ఒక గాయం’ అంటూ సాగే ఈ సాంగ్ సినిమాలో లవ్ పెయిన్‌ గురించి తెలుపుతూ.. ఎమోషనల్‌గా సాగుతుందట.

Advertisement

Next Story