‘ఆరెంజ్’ రీ రిలీజ్.. థియేటర్‌లో ఎమోషనల్ అయిన భాస్కర్!

by Vinod kumar |   ( Updated:2023-03-30 12:39:56.0  )
‘ఆరెంజ్’ రీ రిలీజ్.. థియేటర్‌లో ఎమోషనల్ అయిన భాస్కర్!
X

దిశ, సినిమా: రామ్ చరణ్ హీరోగా, భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘ఆరెంజ్’. నాగబాబు నిర్మించిన ఈ చిత్రం 2010లో విడుదలై బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. క్లాసిక్ లవ్ స్టోరీ‌గా పేరు తెచ్చుకున్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మాత్రం విఫలమైంది. కానీ ప్రజెంట్ జనరేషన్‌కు మాత్రం ఈ సినిమా చాలా బాగా నచ్చింది. ఈ క్రమంలోనే చరణ్ బర్త్ డే సందర్భంగా మూవీని తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేశారు. దీంతో ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభిస్తుంది. దీంతో డైరెక్టర్ భాస్కర్ థియేటర్‌కు వెళ్లి ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు. గతంలో డిజాస్టర్‌గా నిలిచిన తన సినిమా ఇప్పుడు దక్కుతున్న ప్రేక్షకుల ఆదరణ చూసి ఎమోషనల్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి: టార్గెట్ చేసి బాలీవుడ్ నుంచి తరిమేశారు: ప్రియాంక



Advertisement

Next Story

Most Viewed