కోనా వెంకట్ చేతుల మీదుగా 'ఏందిరా ఈ పంచాయితీ' నుంచి ‘ఏమో ఏమో’ సాంగ్ విడుదల

by Shiva |   ( Updated:2023-09-01 11:22:12.0  )
కోనా వెంకట్ చేతుల మీదుగా ఏందిరా ఈ పంచాయితీ నుంచి ‘ఏమో ఏమో’ సాంగ్ విడుదల
X

దిశ, సినిమా : విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీలు ఎప్పుడూ ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్‌ను ఇస్తుంటాయి. ఇప్పుడు టాలీవుడ్‌లో ఎక్కువగా ప్రేమకథా చిత్రాలే వస్తున్నాయి. చిన్న చిత్రాలు పెద్ద విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. ఇప్పుడు అందమైన గ్రామీణ ప్రేమకథా చిత్రం ఒకటి రాబోతోంది. ‘ఏందిరా ఈ పంచాయితీ’ అనే ఈ మూవీ విలేజ్ లవ్ స్టోరీగా వస్తోంది. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం ఈ మూవీని నిర్మిస్తుండగా.. గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. భరత్, విషికా లక్ష్మణ్‌లు ఈ చిత్రంతో హీరో, హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు.

కాగా, తాజాగా కోనా వెంకట్ చేతుల మీదుగా 'ఏమో.. ఏమో' అంటూ సాగే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. పీఆర్ (పెద్దపల్లి రోహిత్) బాణీ సాహిత్యాన్ని సమకూర్చిన పాటను.. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. 'గ్రామీణ వాతావరణంలో తెరకెక్కించిన ఈ పాట బాగుంది. కొత్త వాళ్లైనా చక్కగా నటించారు. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ కూడా బాగుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చి పెట్టాలి' అని టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు కోనా వెంకట్.

Advertisement

Next Story