అత్యంత ప్రభావవంతమైన మహిళల్లో ఏక్తాకు చోటు.. ఏకైక భారతీయురాలిగా రికార్డ్

by Prasanna |   ( Updated:2023-05-18 06:57:15.0  )
అత్యంత ప్రభావవంతమైన మహిళల్లో ఏక్తాకు చోటు.. ఏకైక భారతీయురాలిగా రికార్డ్
X

దిశ, సినిమా : అంతర్జాతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రభావవంతమైన 40 మంది మహిళల జాబితాలో ఏక్తా కపూర్ చోటు దక్కించుకుంది. ఈ మేరకు ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ తాజాగా రిలీజ్ చేసిన లిస్ట్‌లో స్థానం పొందిన ఏకైక భారతీయురాలిగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా ‘భారతీయ టెలివిజన్ చిత్ర నిర్మాత, దర్శకురాలు. 1994లో స్థాపించబడిన బాలాజీ టెలిఫిల్మ్స్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ క్రియేటివ్ హెడ్ ఏక్తా కపూర్.. దక్షిణాసియాలోని అత్యంత విజయవంతమైన టీవీ నిర్మాతలలో ఒకరిగా ఎదిగింది’ అంటూ పోర్టల్ ఆమెను పొగిడేసింది. ఇక ఈ జాబితాలో స్వీడన్, నైజీరియా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలకు చెందిన పలువురు మహిళలు కూడా ఉన్నారు.

ఇవి కూడా చదవండి: టాలీవుడ్ నెంబర్ 1 స్థానం ఆ హీరోయిన్‌దేనా?

Advertisement

Next Story