- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘వివేకం’ సినిమా ఎఫెక్ట్.. ఈసీకి హైకోర్టు కీలక ఆదేశం..!
దిశ, వెబ్‌డెస్క్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సోదరుడు.. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ చిన్నాన్న మాజీ ఎంపీ వివేకానందరెడ్డి మర్డర్ కేసును బయోపిక్ గా ‘వివేకం’ సినిమాగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ యూట్యూబ్ లో విడుదలై హల్ చల్ చేస్తోంది. రిలీజైన 24 గంటల్లోనే 10 లక్షలకు పైగా మంది వీక్షించారంటే ఏ రేంజ్‌లో ట్రెండింగ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అంతేకాకుండా ఈ మూవీలోని కొన్ని సీన్స్ సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ‘వివేకా హత్యకు దారి తీసిన పరిస్థితులు, ఈయనను హత్య చేయడానికి కుట్ర చేసిందెవరు, హత్య ఎక్కడ జరిగింది, దీని వెనక ఉన్న సూత్రదారులు ఎవరు? వివేకానంద రెడ్డిని అత్యంత కిరాతకంగా చంపడం వంటి సన్నివేశాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు.
అయితే ఈ కేసులో కీలక నిందుతుడిగా ఉన్న దస్తగిరి అప్రూవల్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో నిలిచారు. అయితే ఈ మూవీలో దస్తగిరి పేరు వాడుకోవడం పై ఆయన అభ్యతరం వ్యక్తం చేశారు. తను ఎన్నికల బరిలో ఉన్నందున ఈ సినిమాలో తన పేరు వాడడం వల్ల ఆ ప్రభావం ఓటింగ్ పై పడే అవకాశం ఉందని, తన పేరును సినిమా నుంచి తొలగించాలని దస్తగిరి హైకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా జరిగిన విచారణలో వివేకం సినిమాపై పూర్తి వివరాలు అందించాలని న్యాయస్థానం కేంద్ర ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది. తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది.