పెళ్లి పీటలెక్కబోతున్న దసరా డైరెక్టర్ Srikanth Odhela?

by samatah |   ( Updated:2023-05-31 10:02:42.0  )
పెళ్లి పీటలెక్కబోతున్న దసరా డైరెక్టర్ Srikanth Odhela?
X

దిశ, వెబ్‌డెస్క్ : శ్రీకాంత్ ఓదేల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాని హీరోగా తెరకెక్కిన దసరా మూవీకి దర్శకుడిగా వ్యవహరించి, మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. దీంతో ఇక ప్రస్తుతం ఎవరినోట విన్నా ఈయన పేరే వినబడుతుంది. నెక్ట్స్ ఏం ప్రాజెక్ట్ చేయబోతున్నాడు, ఎలాంటి కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను అలరిస్తాడో అని చాలా మంది వేయిట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈయనకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఏమిటంటే?ఆయన పెళ్లి గురించి పలు వార్తలు వినిపిస్తున్నాయి త్వరలోనే ఈ డైరెక్టర్ ఒక ఇంటి వాడు కాబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. పుష్ప సినిమా షూటింగ్‌కు సహకరిస్తున్న ఆయన ఆ షూటింగ్ ముగియడంతో తన సొంత జిల్లా అయిన కరీంనగర్‌కు వెళ్లాడని, అక్కడే పెళ్లిచేసుకోబోతున్నట్లు సమాచారం.

Read More.. Jr NTR: ఎన్టీఆర్, అనుష్క కాంబినేషన్‌లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా?

Advertisement

Next Story