- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ రిలీజ్ వాయిదా.. కొత్త డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్
దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అంతేకాకుండా తన నటనతో అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఇటీవల కల్కిలో కీలక పాత్ర చేసి మెప్పించాడు. ప్రజెంట్ దుల్కర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్’ చేస్తున్నాడు. పిరియాడికల్ స్టోరీతో రాబోతున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై తెరకెక్కుతోంది.
ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఇందులోంచి విడుదలైన అప్డేట్స్ మంచి రెప్సాన్స్‌ను దక్కించుకున్నాయి. అయితే లక్కి భాస్కర్ సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ క్రమంలో.. తాజాగా, మేకర్స్ లక్కీ భాస్కర్ డేట్ మార్చినట్లు అధికారికంగా ట్విట్టర్ వేదికగా ఓ పోస్టర్ విడుదల చేశారు. ‘‘ మా లక్కీ భాస్కర్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నందుకు మేము అభినందిస్తున్నాము.
మీ అభిమాన హీరో దుల్కర్ సినిమా విషయంలో రాజీపడకుండా అత్యుత్తమ సీన్స్‌లో ఒకటి అందించాము. అయితే అన్ని భాషల డబ్బింగ్ విషయంలో మేము రాజీ పడటం లేదు. సాధ్యమైనంత వరకు వాస్తవికంగా అనిపించేలా చేయాలనుకుంటున్నాము. మేము కోరుకునే నాణ్యత సాధించడానికి మాకు మరికొంత సమయం కావాలి, భారమైన హృదయంతో, మేము ఈ చిత్రాన్ని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం. లక్కీ భాస్కర్ ఇప్పుడు దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కానుంది’’ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా దుల్కర్‌కు సంబంధించిన ఓ పోస్టర్ షేర్ చేశారు.
Postponing releases can impact social media reputation, but it's essential for our film's quality! 😔#LuckyBaskhar is set to make your Diwali special in theaters worldwide. 🏦🎇
— Sithara Entertainments (@SitharaEnts) August 20, 2024
Grand release on Oct 31st, 2024. #LuckyBaskharOnOct31st 💵@dulQuer #VenkyAtluri @Meenakshiioffl… pic.twitter.com/cJCbFdeFr2