Dulquer Salmaan: పాన్ ఇండియా మూవీతో రాబోతున్న దుల్కర్ సల్మాన్.. క్యూరియాసిటీ పెంచేస్తున్న పోస్టర్

by sudharani |
Dulquer Salmaan: పాన్ ఇండియా మూవీతో రాబోతున్న దుల్కర్ సల్మాన్.. క్యూరియాసిటీ పెంచేస్తున్న పోస్టర్
X

దిశ, సినిమా: మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో తనదైన స్టైల్లో రాణిస్తున్న ఈ హీరో రీసెంట్‌గా విడుద‌లైన పాన్ ఇండియా బ్లాక్ బ‌స్టర్ ‘క‌ల్కి 2898 ఏడీ’ నటించి మెప్పించాడు. ప్రజెంట్ ఈయ‌న హీరోగా తెలుగులో ఓ సినిమా స్టార్ట్ కాబోతోంది. విల‌క్షణ‌మైన క‌థాంశాల‌తో డైరెక్టర్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న ప‌వ‌న్ సాధినేనితో చేతులు క‌లిపారు. దుల్కర్ స‌ల్మాన్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేక‌ర్స్.

‘ఆకాశంలో ఒక తార’ అనే టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ ఇందులో.. పోస్టర్ ఆధారంగా దుల్కర్ ఓ రైతు లుక్‌లో కనిపించి మెప్పించాడు. అంతే కాకుండా అదే పోస్టర్‌లో ఓ చిన్నారి స్కూల్ బ్యాగ్ వేసుకుని వెళుతుండ‌టాన్ని చూడొచ్చు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారడంతో.. ఆడియెన్స్‌లో ఓ క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలైన గీతా ఆర్ట్స్‌, స్వప్న సినిమాల‌తో పాటు లైట్ బాక్స్ మీడియా బ్యాన‌ర్స్ స‌మ‌ర్పణ‌లో సందీప్ గుణ్ణం, ర‌మ్య గుణ్ణం ఈ మూవీని నిర్మిస్తున్నారు. కాగా.. త్వర‌లోనే షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తుండగా.. న‌టీన‌టులు వివ‌రాల‌ను త్వర‌లోనే తెలియ‌జేస్తామ‌ని మేకర్స్ తెలిపారు.

Advertisement

Next Story